వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. రాగల 48 గంటల్లో అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. వాయుగుండంగా మారే క్రమంలో ఉమ్మడి విజయనగరం, మన్యం జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.