చెన్నై పూనమలేలో శేఖర్ అనే వ్యక్తి తన ప్రియురాలి కోసం తన సొంత తమ్ముడినే మోసం చేశాడు. తన తమ్ముడికి చెందిన 550 గ్రాముల బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బుతో ప్రియురాలు స్వాతి కోసం కారు కొన్నాడు. మిగిలిన నగలు అమ్మి గోవా వెళ్లే టైంలో శేఖర్ తన తమ్ముడికి దొరికి పోయాడు. దీంతో శేఖర్ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి శేఖర్, అతని ప్రియురాలు స్వాతిని అరెస్టు చేశారు.