ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజజీవితంలోనూ...సినిమాను తలపించే సీన్..కిడ్నాప్ కు గురై తొమ్మిదేళ్ల తరువాత ఇంటికి

national |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 05:04 PM

నిజజీవితంలోనూ సినిమాను మించిన ఘటనలు చోటు చేసుకొంటూవుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల వయసులో అపహరణకు గురై కుటుంబానికి దూరమైన ఓ బాలిక తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరింది. థ్రిల్లర్‌ని సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన ముంబయిలోని అంధేరిలో వెలుగుచూసింది. అయితే, బాలిక తిరిగి తన కుటుంబాన్ని చేరడానికి ఓ డిజిటల్‌ మిస్సింగ్‌ పోస్టరే కీలక ఆధారంగా పనిచేయడం విశేషం. వివరాల్లోకి వెళ్తే అంధేరికి చెందిన పూజ (7) 2013 జనవరి 22 న తన సోదరుడితో కలిసి స్కూల్‌కు వెళ్లింది. అక్కడ హెన్రీ జోసెఫ్‌ డిసౌజా అనే వ్యక్తి ఆమెకు ఐస్‌క్రీమ్‌ ఆశచూపి కిడ్నాప్‌ చేశాడు. బాలికను ఎవరూ గుర్తు పట్టలేరని నిర్ధారించుకున్నాక ఆమె పేరును అన్నే డిసౌజాగా మార్చి కర్ణాటకలోని ఓ హాస్టల్‌లో చేర్పించాడు.


కొన్నాళ్లకు నిందితుడు హెన్రీ దంపతులకు ఓ బిడ్డ పుట్టడంతో ఇంటి పనుల కోసం పూజను హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. పనులు చేయించునేవారి కానీ బాలిక సరిగా చూసుకొనేవారు కాదు. తొమ్మిదేళ్లు అలా గడిచిపోగా.. హెన్రీనే తన తండ్రిగా భావించింది. అయితే, ఒక రోజు పూజకు అసలు విషయం తెలిసింది. హెన్రీ తాగిన మత్తులో పూజ తన కూతురు కాదన్న నిజాన్ని బయటపెట్టడంతో షాకయ్యింది. దీంతో తాను ఎవరు? తల్లిదండ్రుల ఆనవాళ్లను తెలుసుకొనే ప్రయత్నం చేసింది. తన స్నేహితురాలి సహకారం తీసుకొని ఇంటర్నెట్‌లో శోధించింది.


‘Pooja missing’ అని వెతకగా.. చివరకు 2013లో తాను మిస్సింగ్‌ అయినట్టుగా ఉన్న పోస్టర్‌ కనిపించింది. అందులో ఐదు ఫోన్‌ నంబర్లు ఉండగా.. వాటిని సంప్రదించే ప్రయత్నం చేస్తే నాలుగు నంబర్లు పనిచేయలేదు. చివరకు ఐదో నంబర్‌కు డయల్‌ చేయగా.. అది తన కుటుంబం పొరుగున నివసించే రఫీక్‌ అనే వ్యక్తిది. అతడు ఫోన్‌ను లిఫ్ట్ చేయడంతో పూజ తన గురించి మొత్తం విషయాన్ని చెప్పింది. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన రఫీక్‌ వెంటనే వీడియో కాల్‌ చేసి బాలికను పూజగా గుర్తించాడు. ఆ తర్వాత ఆమె తల్లితో మాట్లాడే ఏర్పాటు చేశాడు. పూజను చూడగానే గుర్తుపట్టిన.. వీడియో కాల్‌లో ఒకరినొకరు చూసుకొని ఉద్వేగానికి లోనయ్యారు.


ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. డిసౌజాను అరెస్టు చేసి.. పూజ తీసుకొచ్చి ఆమె కుటుంబానికి అప్పగించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డ ఎక్కడుందో, ఏమైపోయిందో తెలియక తొమ్మిదేళ్ల పాటు నరకయాతన అనుభవించిన ఆ తల్లి.. కుమార్తెను చూడగానే పట్టరాని సంతోషంతో కౌగిలించుకున్న దృశ్యాలు అక్కడున్నవారిని కంటతడిపెట్టించాయి. అయితే, పూజ అపహరణకు గురైన కొన్నేళ్ల తర్వాత ఆమె తండ్రి చనిపోయాడు.


చిన్నతనంలో తమకు దూరమైన పూజ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడంతో బాలిక తల్లి, సోదరుడి ఆనందానికి పట్టపగ్గాల్లేవు. సీనియర్ పోలీస్ అధికారి మిలింద్ కుర్దేర్ మాట్లాడుతూ.. హెన్రీపై కిడ్నాపింగ్‌, చట్టవ్యతిరేక కార్యకలాపాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పిల్లలు పుట్టకపోవడం వల్లే ఆ దంపతులిద్దరూ బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని, ఈ కేసులో అతడి భార్యను కూడా నిందితురాలిగా చేర్చామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com