బ్యాలెట్ పేపర్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ హెడ్‌క్వార్టర్స్ గూఢచారి సంస్థ హెచ్చరికల నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు బ్రిటన్ దేశ ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ జాప్యం కానుందని ది టెలిగ్రాఫ్ పత్రిక నివేదిక పేర్కొంది. ఓటింగ్ ప్రక్రియ, దాని ప్రభావం గురించి సలహా మరింత సాధారణమైనది.. దీని వల్ల ఎటువంటి నిర్ధిష్ట ముప్పు లేదని వ్యాఖ్యానించింది.
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత రిషి సునాక్ పుంజుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులకు గతవారం నిర్వహించిన పోల్‌లో తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ తో ఉన్న అంతరాన్ని ఆయన గణనీయంగా తగ్గించుకోగలిగారు. ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య కేవలం 5 శాతం మాత్రమే తేడా ఉంది. ఇటలీకి చెందిన ప్రజా వ్యవహారాల సంస్థ టెక్నీ.. గతవారం 807 మంది కన్జర్వేటివ్ సభ్యులను సర్వే చేసింది. ఇందులో రిషి సునాక్‌కు 43% మంది, లిజ్ ట్రస్‌కు 48% మంది మద్దతు తెలపగా.. 9% మంది మాత్రం తటస్థంగా ఉండిపోయారు.
గతవారం బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగవ్’ నిర్వహించిన సర్వేలో ట్రస్‌కు 62% , రిషికి 38% మంది మద్దతిచ్చారు. ఇద్దరి మధ్య తేడా 24% కనిపించింది. తాజాగా, అది 5 శాతానికి తగ్గడం సునాక్‌కు ఊరటనిచ్చే అంశమే. మరోవైపు, బ్యాలెట్ పేపర్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ హెడ్‌క్వార్టర్స్ గూఢచారి సంస్థ హెచ్చరికల నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ప్రధాని ఎన్నుకునే ప్రక్రియ జాప్యం కానుందని ది టెలిగ్రాఫ్ పత్రిక నివేదిక పేర్కొంది. ఓటింగ్ ప్రక్రియ, దాని ప్రభావం గురించి సలహా మరింత సాధారణమైనది.. దీని వల్ల ఎటువంటి నిర్ధిష్ట ముప్పు లేదని వ్యాఖ్యానించింది.
టెలిగ్రాఫ్ ప్రకారం.. ఆందోళనల ఫలితంగా కన్జర్వేటివ్ పార్టీ తదుపరి నాయకుడి ఎన్నిక కోసం సభ్యులు తమ ఓటును మార్చుకోవడానికి అనుమతించే ప్రణాళికలను పక్కనబెట్టింది. దాదాపు 160,000 మంది పార్టీ సభ్యులకు పోస్టల్ బ్యాలెట్లు ఇంకా పంపలేదని, ఆగస్టు 11 నాటికి ఆలస్యంగా చేరుకోవచ్చని చెప్పినట్టు నివేదిక ఉటంకించింది. బ్యాలెట్‌లను సోమవారం నుంచి పంపించాల్సి ఉందని ది టెలిగ్రాఫ్ నివేదించింది.
బ్రిటన్‌కు అంతర్జాతీయంగా బెదిరింపులు, అంతరాయాలను కలిగించేవారి గురించి సమాచారాన్ని జీసీహెచ్‌క్యూ సేకరిస్తుంది. అందులో భాగమైన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ప్రతినిధి మాట్లాడుతూ... కన్జర్వేటివ్ పార్టీకి జీసీహెచ్‌క్యూ సలహాలు అందించిందని తెలిపారు. ‘‘యూకే ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియలను రక్షించడంఎన్సీఎస్పీ కి ప్రాధాన్యతనిస్తుంది.. సైబర్ భద్రతలో మార్గదర్శకత్వం, మద్దతును అందించడానికి మేము అన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులు, ఎంపీలతో కలిసి పని చేస్తాం’’రాయిటర్స్‌తో అన్నారు.
‘‘ఆశించినట్టుగానే యూకే జాతీయ సైబర్ సెక్యూరిటీ అథారిటీ నుంచి నాయకత్వ ఎంపికపై ఓటింగ్ కోసం భద్రతాపరమైన విషయాలపై మేము కన్జర్వేటివ్ పార్టీకి సలహాలు అందించాం’’ అని ప్రతినిధి పేర్కొన్నారు. ఒపీనియన్ పోల్స్‌లో ట్రస్ ఆధిక్యత ప్రదర్శించడంతో ఐదు వారాల ఎన్నికల అనంతరం సెప్టెంబరు 5న బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనేది వెల్లడికానుంది.