కావలసిన పదార్ధాలు : బియ్యం - 2 కప్పులు, బెల్లం - 1 కప్, యాలకుల పొడి - 1 స్పూన్, కాచిన పాలు - 3 కప్పులు, నెయ్యి - 2 స్పూన్లు, జీడిపప్పు, బాదాం, పిస్తా, కిస్మిస్ ముక్కలు - 2 స్పూన్లు, పచ్చి శనగపప్పు - 1 స్పూన్, సాయి పెసరపప్పు - 1 స్పూన్, పచ్చ కర్పూరం - చిటికెడు.
తయారీవిధానం:
-- ఒక కప్ బియ్యానికి ఒకటి ముప్పావు చొప్పున నీటిని జోడించి కుక్కర్లోకి తీసుకోవాలి. అరగంట నానిన తరవాత కుక్కర్ లో పచ్చి శనగపప్పు, సాయి పెసరపప్పు, రెండు కప్పుల పాలు వేసి మూతపెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి.
-- రెండు విజిల్స్ వచ్చిన తరవాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-- ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, గిన్నె పెట్టుకుని, అందులో బెల్లం తరుగు వేసి, ఒక కప్ నీళ్లు పోసి పాకం వచ్చేంతవరకు మరగబెట్టుకోవాలి.
-- కుక్కర్ మూత తీసి, అన్నాన్ని కొద్దిగా స్మాష్ చేసుకుని బెల్లం పాకాన్ని కలుపుకోవాలి. అవసరమైతే, ఇంకాస్త పాలను యాడ్ చేసుకుని, ఒక ఐదు నిముషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి.
-- ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న కళాయిని పెట్టుకుని, నెయ్యి వెయ్యాలి. అందులో జీడిపప్పు, బాదాం, పిస్తా, కిస్మిస్ ముక్కలు వేసి వేపుకోవాలి. దీనిని పొంగలిలో కలుపుకోవాలి. ఇందులోనే కాస్తంత యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసి బాగా కలుపుకుంటే పొంగలి రెడీ.