రాష్ట్రంలోని పలు సమస్యలపై ప్రధాని నరేంద్ర మోడీతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన భేటీపై విజయసాయి స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశం విజయవంతం కావడం పట్ల చర్చించామని వెల్లడించారు. దాంతోపాటే ఏపీకి చెందిన కీలక విషయాలపైనా ప్రధానితో మాట్లాడానని తెలిపారు. ఆయా అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం అన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని విజయసాయి వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తోడ్పాటు అందించాలని కోరినట్టు తెలిపారు. భేటీ సంరద్భంగా మోదీకి శాలువా కప్పిన విజయసాయి, ఓ జ్ఞాపికను బహూకరించారు.