భారత స్టాక్ మార్కెట్ లాభాలో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 465.14 పాయింట్లు లాభపడి 58,853.07 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఈరోజు ఆశాజనకమైన ఫలితాలను అందుకుంది. నిఫ్టీ 127.60 పాయింట్ల లాభంతో 17,525.10 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా షేర్లు పెరగగా, బీపీసీఎల్, ఎస్పీబీవై షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.ముఖ్యంగా ఆటోమొబైల్, మెటల్, ప్రైవేట్ బ్యాంకులు నేటి ట్రేడింగ్‌లో లాభపడ్డాయి. కానీ ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ మాత్రం నిరుత్సాహకర ఫలితాలు నమోదు చేసింది.