తిరుపతిలోని వడమాలపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రియాంక అనే యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కాగా, వారం రోజుల క్రితం ప్రింయాంకకు నిశ్చితార్థం జరుగగా.. పెళ్లి మండపం కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఎంఎస్ చదువుతోన్న ప్రియాంక ఇటీవలే పెళ్లి చేసుకోవడానికి తిరిగివచ్చినట్లు సమాచారం.