శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. వరద ప్రవాహం పెరగడంతో జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1, 51, 058 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1, 47, 254 క్యూసెక్కులుగాను, పూర్తిస్థాయి నీటి నిల్వ 215. 8070 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 215. 8070 టీఎంసీలుగా వుంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.