కోదండ రామాలయానికి పర్యాటకులు, భక్తులు, యాత్రికులు ఎక్కువగా రావడంతో నీటి కొరత ఉందని టిటిడి అధికారులు గ్రహించి వావిలకులను సుబ్బారావు కొండపైన 60 వేల లీటర్ల నీటి ట్యాంకులు నిర్మించుటకు టిటిడి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ టెండర్‌ను ఒంటిమిట్ట మండలానికి చెందిన జంగా పేరు మాజీ సర్పంచ్ బూట్స్ వెంకటేశు దక్కించుకున్నారు. త్వరలో నాణ్యతతో కూడిన ట్యాంకును నిర్మించి పనులను పూర్తి చేస్తామని ఆయన అన్నారు.