గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఇంటింటికీ తాగునీటి పథకం సేవలు విస్తరిస్తున్నట్లు శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ అన్నారు. కవిటి మండలంలోని చిన్నసహలాలపుట్టుగలో 15 వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 1. 5 లక్షల వ్యయంతో ఇంటింటికీ మంచినీటి కుళాయి సౌకర్యం, పరిమిపుట్టుగలో మండల పరిషత్ నిధుల నుంచి రూ. 1. 5 లక్షలు, 15 వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 2 లక్షలు వెచ్చించి మంచినీటి బోరు, ఇంటింటికీ కుళాయి సేవలు కవిటి ఎంపీపీ కడియాల పద్మప్రకాష్, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడాప్ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రవిప్రధాన్, బడ్డాయి మురళి తదితరులు పాల్గొన్నారు.