జి. కొండూరు మండలం పినపాక గ్రామంలో మంగళవారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.