ప్రస్తుత వర్షా కాలంలో అనేక జనాలు అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా డెంగ్యూ వంటి సమస్యలు తీవ్ర ఇబ్బంది పెడతాయి.సీజనల్ వ్యాధులను తట్టుకోవాలంటే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తప్పనిసరిగా ఉండాలి. అయితే, ఈ వర్షాకాలంలో సీజనల్ జబ్బుల నుంచి రక్షించుకోవడానికి కివి పండును తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కివి పండులో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డెంగ్యూ రోగుల్లో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో కివి అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు వైద్యులు. కివి లో రోగ నిరోధక శక్తిని పెంచే విలువైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌ల కొరతను అధిగమించడంలో కివి అద్భుతంగా పని చేస్తుంది.
కివీ ఫ్రూట్ తినడం వలన కలిగే ప్రయోజనాలు..
విటమిన్ సి: కివీ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కివి పండును రోజూ ఒకటి తినడం వలన శరీరానికి అవసరమైన సి విటమిన్‌ను అందిస్తుంది. ఇందులో పీచు పదార్థం ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కివిలో ఉండే విటమిన్ సి కంటెంట్.. నారింజ, నిమ్మకాలయ కంటే రెట్టింపు ఉంటుంది. ఇందులో విటమిన్ సితో పాటు, యాంటీ-ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. కివీపండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ ఇ, సి పొటాషియం:
కివి లో విటమిన్ ఇ, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొవ్వు కారణంగా ధమనులు మూసుకుపోకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. మంచి శరీరాకృతిని, మెరుపును అందిస్తుంది.
విటమిన్ కె, ఎ:
కివిలో విటమిన్ కె, విటమిన్ ఎ కూడా ఉన్నాయి. ఆరోగ్యకరమైన కెరోటినాయిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కివిలో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, బరువు పెరుగకుండా సహకరిస్తుంది.
లుటిన్, జియాక్సంతిన్:
కివిలో లుటిన్, జియాక్సంతిన్ వంటి ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి. ఇవి శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడుతాయి. ఇది రక్తంలో ఆక్సీజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తహీనత సమస్యను అధిగమించడంలోనూ సహాయపడుతుంది. ఈ ఫైటోకెమికల్స్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంపై మచ్చలను తొలగిస్తుంది.
తక్కువ చక్కెర కంటెంట్:
కివి లో చెక్కర కంటెంట్ చాలా తక్కువగా ఉంది. ఇది మధుమేహ నియంత్రణకు కూడా సహాయపడుతంది. ఇందులో సెరోటోనిన్ ప్రేరేపిత రసాయనాలు ఉంటాయి. దీనిని రోజూ ఒకటి చొప్పున తినడం వలన నిద్రలేమి సమస్యను కూడా దూరం చేస్తుంది. చైనీస్ సాంప్రదాయ ఔషధ నిపుణులు.. వివిధ చికిత్సా ఔషధాలలో దీనిని ఉపయోగిస్తారు.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..
కివీఫ్రూట్ సూక్ష్మజీవులతో పోరాడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తుంది. యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్న ఈ పండును రోజూ ఒకటి చొప్పున తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడుకుండా ఉండొచ్చు.