ఏపీలోని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కొడుకు శ్రీరాజ్‌పై కేసు నమోదైంది. ఓ యువతిని వేధించినట్లు ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీంతో శ్రీరాజ్‌పై కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. 354, 354డీ, 509 సెక్షన్ల క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విచారణలో ఆరోపణలు వాస్తవాలని తేలితే శ్రీరాజ్ అరెస్ట్ అయ్యే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa