బీహార్‌లో ఒకవైపు పొలిటికల్ టెన్షన్ నెలకొని ఉంటే.. మరో వైపు ఆ రాష్ట్ర స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాకు కరోనా వైరస్ సంక్రమించింది. జేడీయూ, బీజేపీ బంధానికి బ్రేక్ పడే సమయంలో స్పీకరే కీలకంగా మారనున్నారు. అయితే పాజిటివ్ వచ్చిన ఒక్క రోజు తేడాలోనే స్పీకర్ కరోనా పరీక్షలో మళ్లీ నెగటివ్ తేలారు. సోమవారం స్పీకర్ ట్విట్టర్లో కరోనా రిపోర్ట్‌ను వెల్లడించగా చాలామంది ఆశ్చర్యపోతున్నారు.