స్పందన అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల అధికారులకు ఆదేశించారు . కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు .
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు , ఆర్ . డి . ఓ . ఐ . కిషోర్ తదితరులు పాల్గొన్నారు . అర్జీలు సమర్పించిన వారిలో ముసలి వయస్సు కలిగిన వ్యక్తి రావడం చూసి ఆయన చలించిపోయారు.
వెంటనే తనని పిలిచి కూర్చోబెట్టి తన సమస్యను విని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు, అలానే సమస్యల పరిష్కారానికి పని చెయ్యాలని అధికారులకి ఆదేశాలు జారీ చేసారు.