ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హత్య కేసులలో ప్రధాన నిందితుడుగా వున్న మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ తప్పించుకుని తిరుగుతూ ఆంధ్రపదేశ్ మరియు తెలంగాణా రాఫాలలో తిరుగుతున్నాడన్న సమాచారం మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీస్ .
జిల్లా నగర పోలీసు కమీషనర్ శ్రీకాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్.ని మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ విషయమై సహాయం కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్. అదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఏ.డి.సి.పి. శ్రీ కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో, టాస్క్ ఫోర్సు ఏ.సి.పి. శ్రీ జి.వి. రమణ మూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్సు ఎస్.ఐ. శ్రీ ఆర్.ఏం.వి.పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ నాగ మల్లేశ్వర రావు, పోలీస్ కానిస్టేబుల్లు రామకృష్ణ మరియు నాగారాజులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ పై నిఘా ఏర్పాటు చేసి గుర్తించి, అదుపులోనికి తీసుకుని ఉత్తరాఖండ్ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీస్ సీనియర్ ర్ఎస్.పి. గారు మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ ను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆంద్రప్రదేశ్, ఎన్.టి.ఆర్. జిల్లా టాస్క్ ఫోర్సు ఏ.సి.పి. శ్రీ జి.వి. రమణ మూర్తి గారు, ఎస్.ఐ. శ్రీ ఆర్.ఏం.వి.పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ నాగమల్లేశ్వరరావు, పి.సి.లు రామకృష్ణ మరియు నాగారాజులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసాపత్రాలతో అభినందించడం జరిగింది.