మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదు . పైగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటున్నారు సకల శాఖ మంత్రి సజ్జల అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళ్ళితే ....... శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.... బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అత్యాచారం కేసు నమోదు చెయ్యకుండా తగాదా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసులు. స్థానిక వైసిపి నేతల ఒత్తిడితో పోలీసులు కేసు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారు.
మహిళపై అత్యాచారానికి పాల్పడిన సోమశేఖర్, అఖిల్, అక్కులప్ప, వారికి సహకరిస్తున్న స్థానిక వైసిపి నేతలను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చెయ్యాలి అని డిమాండ్ చేసారు.