బీహార్‌లోని రోహ్తస్ జిల్లాకు చెందిన యువతి ఉపాధి నిమిత్తం హరిద్వార్‌లోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. పొరుగున అద్దెకుండే రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆమెను నమ్మించి, యూపీకి తీసుకెళ్లి రూ.2 లక్షలకు అమ్మేశాడు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిగింది. బాధితురాలు ఇటీవల తప్పించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తాజాగా డెహ్రాడూన్‌లో డీఐజీ గర్వాల్‌కు ఫిర్యాదు చేసింది. డీఐజీ దర్యాప్తుకు ఆదేశించారు.