ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే వివాహం.. ఇంతలోనే వధువు దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 01:46 PM

చీమకుర్తి: పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద మంగళవారం ఆగి ఉన్న బస్సును స్కూటీ ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న చిలకలూరిపేటకు చెందిన రాచుమల్లు సాయి లక్ష్మీరత్న మృతి చెందగా తల్లికి తీవ్రగాయాలయ్యాయి. లక్ష్మీరత్నకు చీమకుర్తికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. వరుడి ఇంటి వద్ద బుధవారం రాత్రి వివాహం జరగాల్సి ఉండగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa