ప్రముఖులను కరోనా వైరస్ వెంటాడుతోంది. తాజాగా రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే మరోసారి కరోనా బారినపడ్డారు. ఆయన ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా కరోనాకు గురయ్యారు. అప్పట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి కోలుకున్నారు. కొన్నినెలల వ్యవధిలోనే ఆయనకు రెండోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన నిన్న రాజ్యసభలో వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. కాగా, తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa