విజయనగరం జిల్లా Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో ఆగస్టు 10న పోలీసు అధికారులు తమ పరిధిలో విధులు నిర్వహిస్తున్న MSPs తో సమావేశమై, వారు నిర్వహించాల్సిన విధులు, నేర నియంత్రణ, సమాచార సేకరణ, అసాంఘిక శక్తులపై నిఘా పెట్టేందుకు అవలంభించాల్సిన పాత్రపై అవగాహన కల్పించి, దిశా నిర్దేశం చేశారు.
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసారు. అలానే ప్రజలు కూడా చట్ట విరుద్ధమైన పనులు చెయ్యకుండా సరైన నడక కలిగి జీవించాలని తెలియజేసారు.