దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య మహోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నందు స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి,భారతదేశ నాలుగవ రాష్ట్రపతిగా సేవలందించిన శ్రీ V.V.గిరి (వరాహగిరి వేంకటగిరి) గారి జయంతి సందర్భంగా అడిషనల్ SP అడ్మిన్ శ్రీ P.శ్రీనివాస్ & అడిషనల్ SP AR శ్రీ B.సత్యనారాయణ, ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో SB DSPs శ్రీ M. అంబికా ప్రసాద్, శ్రీ M.వెంకటేశ్వరరావు, AR DSP అప్పారావు, రిజర్వు ఇన్స్పెక్టర్ లు, DCRB, IT కోర్, కంట్రోల్ రూమ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.