స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని తమ ఛాంబర్ లో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని , వివిధ శాఖలను స్టాల్స్ లను ఏర్పాటు చేయాలని అన్నారు . ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల , జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa