ఈ నెల ఐదోవ తేదీన జరిగిన వృద్ధులు హత్య కేసుని చేదించిన నున్న పోలీసులు. ఎన్.టి.ఆర్.జిల్లా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో వాంబే కాలనీ ఏ బ్లాక్ లో ఈ నెల ఐదోవ తేదిన ఇంటిలో తన తల్లి తండ్రులు ఇద్దరు చనిపోయి ఉన్నారని వారి మరణం పై అనుమానం వుందని వారి కుమార్తె కదిరి హారిమ్మ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన నున్న పోలీస్ వారు Cr.No: 325/2022 U/s 174 crpc అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించటం జరిగింది.
పై సంఘటనపై ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., " ఆదేశాల మేరకు ఏ.డి.సి.పి. శ్రీ కొల్లి శ్రీనివాస్ సూచనల మేరకు, నార్త్ ఇన్ ఛార్జ్ ఏ.సి.పి. శ్రీ రమణమూర్తి అధ్వర్యంలో ఇన స్పెక్టర్లు శ్రీ శ్రీనివాస రావు, శ్రీ బాల మురళీ కృష్ణ శ్రీ లక్ష్మి నారాయణ , ఎస్.ఐ.లు. శ్రీ షరీఫ్ , శ్రీ శ్రీనివాస్ వారి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో పరిశీలించి అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో అనుమానితుడైన నిందితుడిని అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
వివరాల్లోకి వెళితే ....మృతురాలు సిందుపల్లి పైడమ్మ(65) తన భర్త విభేదించి విడిపోయి సిరిగిడి కొండయ్య (60) తో గత కొంత కాలం గా సహజీవనం చేస్తోంది. ఆమె పెద్ద కుమార్తె హారిమ్మకి నారాయణతో, చిన్నకుమార్తె రాజులమ్మకు షేక్.రంజాన్ తో వివాహం జరిగింది. వీరు ఇరువురు కూడా వాంబే కాలనీలో అదే బ్లాక్ నందు నివాసం వుంటున్నారు. చిన్న కుమార్తె వివాహ సందర్భంగా కట్నం నిమిత్తం గా ఇవ్వవలసిన నగదును ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వృద్దుల బాగోగులు పెద్ద కుమార్తె హారిమ్మ చూసుకుంటూ ఉండటం, చిన్న కుమార్తె వారిని పట్టించుకోకపోవడం తో ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బులో కొంత మొత్తం వారి వద్ద ఉంచుకుని మిగిలినది పెద్ద కుమార్తెకి ఇస్తాను అంటూ పలుమార్లు మృతురాలు పైడమ్మ అంటూ ఉండేది. ఇదంతా తెలుసుకున్న పోలీస్ లు అనుమానంతో విచారణ చేపట్టగా అల్లుడే చంపినట్లు తేలింది.