మంగళగిరి: నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయటం లేదంటూ వస్తున్న వార్తలని నారా లోకేష్ ఖండించారు. బుధవారం టీడీపీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం నుండి చంద్రబాబు, మంగళగిరి నుండి తాను పోటీ చేయటం అనివార్యం అని అన్నారు. మంగళగిరిలో ప్రజాధరణ లేదని, ప్రజలకు న్యాయం చేయలేకపోయానని తేలితే అప్పుడు చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానన్నారు.