మంగళగిరి: ఇటీవల కాలంలో నిడమర్రులో వైయస్సార్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి వెళ్లిన సమయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణని బేతపూడి గ్రామంలో ఉన్న అంగన్ వాడీ టీచర్లు కలిసి తమ అంగన్ వాడీ సెంటర్లకు కొంతకాలంగా విద్యుత్ సౌకర్యం లేదని విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయించాలని కోరారు. ఎమ్మెల్యే స్పందించి అధికారులతో మాట్లాడి బేతపూడిలో 3 అంగన్ వాడీ కేంద్రాలకు బుధవారం నూతన విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయించారు.