ముప్పాళ్ళ: కార్మికులకు కనీస కూలీ రేట్లు అమలు చేయాలని కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుమల లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మాదల గ్రామ సచివాలయం వద్ద కార్మిక సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాదాలలో 2000 మంది కూలీలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారని వారిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.