జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.
విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైయస్ జగన్ మరికాసేపట్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.