అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని కోనాం జలాశయంలో వ్యక్తి మృతి చెందాడు. కోణం గ్రామానికి చెందిన కిముడు జోగిదొర కట్టెలు కొట్టి విక్రయిస్తూ జీవిస్తున్నాడు. యధావిధిగా మంగళవారం కట్టెలు కొట్టేందుకు మధ్యాహ్నం పడవపై జలశయం మీదుగా అల్లూరి జిల్లా పాడేరు మండలంలోని అయినాడ పంచాయతీ లోని రావిపాలెం గ్రామం వైపు పడవపై వెళ్ళాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జలాశయ పరిసర ప్రాంతాల్లో వెతికారు. పడవ చెప్పులు పడవ నడిపే తెడ్డు ఉన్నాయి. జోగి దొర కనిపించకపోవడంతో అనుమానంపై వెతకడం ప్రారంభించారు జలాశయంలో పడి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానించారు. గజ ఈతగాళ్ళు చేత జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టడంతో జోగుదొర జలాశయం లో మృతదేహం లభ్యం అయింది. కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం తలించినట్టు ఎస్సై సుధాకర్ రావు తెలిపారు.