లారీ డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోడవరం మండలం దుడ్డు పాలెం వద్ద చోటుచేసుకుంది. చోడవరం ఎస్సై అందించిన వివరాల ప్రకారం.. సబ్బవరం మండలం చినయాత పాలెం గ్రామానికి చెందిన సరగడం సుకేష్ కుమార్, అతడి తల్లి సత్యవతి మునగపాకలో గల తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు మోటార్ సైకిల్ పై బయలుదేరారు. అయితే దుడ్డుపాలెం జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి వెంకన్నపాలెం నుంచి అనకాపల్లివైపు వెళ్లే ఈసుక లారీ అతివేగంగా వెళ్తూ డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా మోటార్ సైకిల్ ని ఢీకొనడంతో తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.