ఏపీ సీఎం జగన్ జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసికం నిధులను గురువారం విడుదల చేశారు. బాపట్లలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేశారు. ఈ పథకం కింద రూ.694 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఏప్రిల్-జూన్ 2022 కాలానికి గానూ 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa