గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయ్యింది. నిన్న ఢిల్లీ అత్యధికంగా 2146 కేసులు నమోదవ్వడంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని వెల్లడించింది. మాస్కు లేని వారికి రూ.500ల ఫైన్ వేయనున్నట్లు సర్కార్ తెలిపింది. నేటి నుంచి ఇది అమలులో ఉంటుందని, ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.