రాఖీ కట్టడానికి ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ పండగ రోజున రాఖీ పళ్లెంలో కుంకుమ తప్పనిసరిగా ఉండాలి. రాఖీ కట్టిన తర్వాత ఆడపిల్లలు సోదరునికి హారతి ఇస్తారు. అందుకే మీ పూజా పళ్లెంలో చిన్న దీపం ఉండాలి. అనంతరం సోదరుడిని ఆశీర్వదీస్తూ అక్షింతలు వేయాలి. ఇవి కూడా ఉండాలి. జీవితంలోని కఠిన పరిస్థితులను ఎదుర్కోనేందుకు సూచికగా సోదరులకు తీపిని తినిపిస్తారు. అందుకే స్వీట్స్ తప్పనిసరిగా ఉండాలి.