టాటా మోటార్స్ ఎస్యూవీ వాహనం 'పంచ్' రికార్డులు సృష్టిస్తోంది. విడుదల చేసిన 10 నెలల్లోనే లక్ష వాహనాల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవటమే కాకుండా.. అతి తక్కువ కాలంలో అత్యధిక ఎస్‌యూవీలను విక్రయించడంలో ఇది రికార్డు నమోదు చేసింది. అంతర్జాతీయ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్లు సంపాదించిన పంచ్ కారుకు మంచి డిమాండ్ వస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ ఏడాది ఒక్క జులైలోనే 11,007 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది.