ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని భవిష్యత్ లో వృద్ధిలోకి రావాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 09:26 PM

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను కల్పిస్తుందని , వారి చదువుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని భవిష్యత్ లో వృద్ధిలోకి రావాలని కృష్ణా  జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అన్నారు .


రాష్ట్ర ముఖ్యమంత్రి వై . ఎస్ . జగన్ మోహన్ రెడ్డి బాపట్ల నుంచి ఏప్రిల్ - జూన్ 2022 త్రైమాసికనికి సంబంధించిన నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాలకు నేరుగా జమ చేసి కార్యక్రమంలో కలెక్టరేట్ నుండి కలెక్టర్ వర్చ్యువల్ గా విద్యార్థులతో కలిసి హాజరయ్యారు . 


జగనన్న విద్యా దీవెన ద్వారా నేడు కృష్ణాజిల్లాలో 37, 582 మంది విద్యార్థులకు రూ .  27 . 21 కోట్లను 32 , 982 మంది తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు . 


అనంతరం విద్యార్దునులు రక్షాబంధన్ ను పురస్కరించుకుని కలెక్టర్ కి రాఖీలు కట్టి దీవెనలు పొందారు . ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల , బి . సి . వెల్ ఫేర్ ఎన్ పవర్ మెంట్ అధికారిణి సి.హెచ్.లక్ష్మీదుర్గా , ఇతర అధికారులు , విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com