దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్‌తోపాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పశువులను లంపీ స్కిన్ డిసీజ్ వేధిస్తోంది.