సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ వచ్చే దేశవాళీ సీజన్ నుంచి గోవా టీంలో ఆడబోతున్నాడు. అతనికి ముంబై జట్టులో ఎక్కువ అవకాశాలు రావడం లేదు. దీంతో అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 22 ఏళ్ల అర్జున్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అతను 2020-21 సీజన్ లో ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై తరపున 2 మ్యాచుల్లో మాత్రమే ఆడాడు. అందుకే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడేందుకు గోవా జట్టుకు మారనున్నాడు.