యూపీలో దారుణం జరిగింది. ఖమారియా గ్రామానికి చెందిన గోవింద్ ను తన భార్య శిల్పి దారుణంగా చంపేసింది. ఈ నెల 7వ తేదీన శిల్పితో గోవింద్ గొడవపడ్డాడు. క్షణికావేశంలో గోవింద్ ను శిల్పి కొట్టి చంపింది. ఇంట్లోనే గొయ్యి తవ్వి పాతిపెట్టింది. ఆమె తన భర్త ఆత్మహత్య చేసుకొన్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది.