పానీపూరీ తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లాలో కలకలం రేపింది. సుగంధ గ్రామంలో బుధవారం ఓ స్ట్రీట్ స్టాల్ వద్ద పానీపూరీ తిన్న వారిలో చాలా మందికి వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. సమాచారం అందుకున్న ప్రత్యేక వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించింది. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.