రాఖీ పండుగను పురస్కరించుకుని ఆశ రేఖ ఫౌండేషన్ చైర్మెన్ నెమిలిదిన్నె నాగవేణి కడప జువైనల్ హోమ్, అర్బన్ రెసిడెన్షియల్ హోమ్ మరియు అంగడి వీధిలొ గల అంధుల అనాధాశ్రయల నందు చిన్నారులుకు, యువకులకు పెద్దలకు రాఖీ కట్టి వారందరికీ అక్కగా చెల్లిగా ప్రేమాభిమానాలను పంచి ధైర్యాన్ని నింపారు. ఎవరూ లేరనే దిగులను చిన్నారులలొ పారుద్రోలేలా గత ఏడు సంవత్సరాలుగా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు నాగవేణి. ఇలా అందరూ వివిధ పండుగలకు మీకు తోచిన విధంగా అనాధ చిన్నారులతొ గడిపి వారికి భరోసాను కల్పించి, ప్రేమను పంచగలరని పిలుపునిచ్చారు.