ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం బలహీనపడింది. రానున్న రెండ్రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు.