భారతదేశానికి స్వాతంత్రం సిద్దించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నేడు OURVMC ఆధ్వర్యంలో గాంధీహిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు,పచ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
అలానే మున్సిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్,మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గార్లతో కలిసి పాల్గొని స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాలను అందరికి తెలిసేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరిగింది.