2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అయితే ప్రధాని పదవిపై మాత్రం తనకు కొంచెం కూడా ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు జెడ్ ప్లస్ భద్రత కల్పించడంపై ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.