ఏపీ సీఎం జగన్ శుక్రవారం విద్యాశాఖపై సమీక్ష చేపట్టారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని, స్కూళ్ల మరమ్మత్తులు వెంటనే బాగుచేసే విధానం ఉండాలని సీఎం ఆదేశించారు. అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలని, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి క్లాస్ రూమ్ లో డిజిటల్ భోధన కోసం టీవీ, డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.