ఫుల్ బాల్ ప్రేమికులకు శుభవార్త. ఖతార్ వేదికగా జరిగే ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే ప్రారంభంకానుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 21న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రోజు సోమవారం వస్తుంది. అది వర్కింగ్ డే.. అందుకే హాలీడే రోజైన ఆదివారం సాయంత్రమే అంటే నవంబర్ 20నే ఈ ఫుట్ బాల్ ప్రపంచ కప్‌ను ప్రారంభించాలని ఫిఫా తాజాగా నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa