వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో టీ20ల్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ సమయంలో విండీస్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో వివిధ లీగుల్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా 'ది హండ్రెడ్' లీగ్లో నార్తన్ సూపర్ ఛార్జర్స్ జట్టులో ఆడుతున్నాడు. గురువారం ఓవల్ ఇన్విజిబుల్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్రావో 600 వికెట్ల మార్క్ ను చేరుకున్నాడు.