బాలివుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన ఇంటిలోని బాల్కానిపై జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలోని పౌరులంతా ఈ నెల 13 (శనివారం) నుంచి 15 (సోమవారం) వరకు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలంటూ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. కేంద్రం ప్రకటన మేరకు ఓ రోజు ముందుగానే బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్పందించారు. తన నివాసంలోని బాల్కనీపై ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ జెండా పక్కనే నిలబడి తీసుకున్న ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.