అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన 4 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడంతో, ఢిల్లీ పోలీసులు శుక్రవారం అంతర్జాతీయ నార్కోటిక్ డ్రగ్ కార్టెల్‌ను ఛేదించినట్లు పేర్కొన్నారు.రహస్య సమాచారం మేరకు ఏసీపీ అత్తర్‌సింగ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇన్స్పెక్టర్ జితేందర్ మావి నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ చేపట్టిందని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.నిందితుడు అఖిలేష్‌ను గాజీపూర్ రోడ్డులో EDM మాల్‌కు సమీపంలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుంచి వచ్చిన సరుకును ఢిల్లీలో డెలివరీ చేసేందుకు మణిపూర్ సరిహద్దు ద్వారా భారత్‌కు తరలించినట్లు విచారణలో వెల్లడైంది.బీహార్‌లోని ఛప్రాకు చెందిన నిందితుడు గత ఏడేళ్లుగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్టు అంగీకరించాడు. అతనిపై సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.