ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శన టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న వారి గుట్టు రట్టు అయింది. ఈ ఘటనలో టీటీటీ ఉద్యోగి మల్లికార్జునతో సహా ఆరుగురు దళారులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా గత ఆరు నెలల వ్యవధిలో ఇలా అక్రమంగా 700ల మందికి శ్రీవారి దర్శనం చేయించినట్లు విచారణలో తేలింది. బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, కళ్యాణోత్సవ టికెట్లు ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa